- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ పోలీస్ శాఖలో కలకలం.. 100 మంది పోలీసులను బురిడీ కొట్టించిన కానిస్టేబుల్
by Ajay Maddhiboyina |
ఏపీ పోలీస్ శాఖలో కలకలం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో క్రిప్టో కరెన్సీ పేరుతో ఓ కానిస్టేబుల్ ఏకంగా వంద మంది పోలీసులను బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది. రూ.3 లక్షలు చెల్లిస్తే ప్రతి నెల రూ.50వేలు వస్తాయని లోవరాజు అనే కానిస్టేబుల్ ఈ మోసానికి పాల్పడినట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ పోలీస్ శాఖలో కలకలం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో క్రిప్టో కరెన్సీ పేరుతో ఓ కానిస్టేబుల్ ఏకంగా వంద మంది పోలీసులను బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది. రూ.3 లక్షలు చెల్లిస్తే ప్రతి నెల రూ.50వేలు వస్తాయని లోవరాజు అనే కానిస్టేబుల్ ఈ మోసానికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఉన్నతాధికారులకు విషయం పొక్కడంతో వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాధారణ పౌరులు ఎవరైనా మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. ఆన్ లైన్ మోసాలు, ఇతర మోసాలను నమ్మవద్దని పోలీసులే సామాన్యులకు అవగాహన కల్పించాలి. కానీ అలాంటి పోలీసులే మోసపోవడం.. పోలీస్ కానిస్టేబులే వారిని మోసం చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story






