సజ్జల నేతృత్వంలో చంద్రబాబు హత్యకు కుట్ర: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

by Disha Web Desk 21 |
సజ్జల నేతృత్వంలో చంద్రబాబు హత్యకు కుట్ర: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఇందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు.సెంట్రల్ జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కార్యక్రమం సజ్జల నడిపిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సెంట్రల్ జైల్ పై డ్రోన్ ఎందుకు ఎగిరిందని ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఈ మేరకు పలు సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమంగా హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌లోని వివరాలను కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని తమకు ఆందోళన కలుగుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed