- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారు
VBGRAMG పై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు.

దిశ, వెబ్ డెస్క్ : MGNREGA పథకం పేరును కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పు చేసింది. పేరు మార్పును ఏఐసీసీ నాయకత్వం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా కూడా పేరు మార్పుపై స్పందించారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీం (MGNREGA) ను వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీన్ యాక్ట్ - 2025 (VBGRAMG)గా మార్చడాన్ని తప్పుబట్టారు. పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు. చట్టాన్ని మార్చి ఉపాధి హామీలోని ఊపిరి తీశారన్నారు. కొత్త చటంలో ఉపాధి లేదని విమర్శించారు. కాంగ్రెస్ అమలు చేసిన MGNREGA, బిజెపి తెచ్చిన VBGRAMGకి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. దానికి ఒక నల్ల చట్టంగా అభివర్ణించారు. రాష్ట్రాల మీద ఆర్థిక భారం మోపి, గ్రామ స్వరాజ్యం వినాశనం చేసే దిశగా కేంద్ర ఈ కొత్త చట్టం తెచ్చిందన్నారు.
నూతన పథకంలో పనులను గ్రామసభ కాకుండా దిల్లీ పెద్దలు నిర్ణయిస్తారని.. అది ప్రజల పని హక్కును కాలరాస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చట్టాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. అన్ని గ్రామాల్లో కాకుండా కేవలం ఎంపిక చేసిన గ్రామాల్లోనే పనులు కల్పిస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి బీజం పడిందన్నారు. ఆయన ఒత్తిడితో 2006లో ఉపాధికి శ్రీకారం చుట్టింది తొలుత ఏపీలోనే అని గుర్తు చేశారు. పనికి ఆహారం పథకం అమలులో వైయస్ఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరువు పని విజయవంతంలో ఏపీ రోల్ మోడల్ అయ్యిందన్నారు. బత్రుకుకు గ్యారంటీ ఇచ్చి, వలసలు నివారించి, పేదల కొనుగోలు శక్తిని పెంచిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నేడు నీరుగారి పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
MGNREGAకు ఏపీ పుట్టినిల్లు అని స్పష్టం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు, మాజీ ముఖ్యమంత్రి ఆశయ సాధనను కాపాడేందుకు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలను చేపడతామని ప్రకటించారు. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలను కలుపుకొని అన్ని జిల్లాలో ఉద్యమిస్తామన్నారు. నూతన చట్టా్న్ని వెనక్కు తీసుకొని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలుపరచాలని డిమాండ్ చేశారు.






