- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుస సెలవులు.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
by Yella Dhawani Reddy |
సలేశ్వరం (Saleshwaram) జాతర ప్రారంభమైన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: సలేశ్వరం (Saleshwaram) జాతర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఆది, సోమ వారాలు వరుస సెలవులు రావటంతో భక్తులు శ్రీశైలం (Srisailam), సలేశ్వరానికి బారులు తీరారు. దీంతో మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద టోల్ ఫీజు చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతోంది. ఫలితంగా శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేట్ నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు.
Next Story






