బీజేపీకి జగన్ దత్త పుత్రుడు: వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-11 11:03:17  IST  )

బీజేపీకి వైెెఎస్ జగన్ దత్త పుత్రుడు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు...

బీజేపీకి జగన్ దత్త పుత్రుడు: వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ(Bjp)‌కి వైఎస్ జగన్(Ys Jagan) దత్త పుత్రుడు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress Pargty Chief Ys Sharmila) అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ బీజేపీ‌తో చంద్రబాబుది పొత్తు అయితే జగన్‌ది అక్రమ పొత్తు అని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ మీద చంద్రబాబు, జగన్ ఈగ కూడా వాలనివ్వరన్నారు. బీజేపీని విమర్శించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అని షర్మిల చెప్పారు. బీజేపీ అరాచకాలను ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీజేపీ రాష్ట్రానికి మోసం చేస్తుంటే ప్రశ్నించే దమ్ము జగన్‌కి, చంద్రబాబుకి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విభజన సమస్యలు ఉన్నాయని చెప్పారు. విభజన హామీలు బీజేపీ అమలు చేయడం లేదని మందిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడి ఉండేన్నారు. హోదా పేరుతో ఇంతకాలం tdp, YCP రాజకీయాలు చేశాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు కూడా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

Next Story