అది సిగ్గుచేటు: ఫ్రీ బస్సు పథకంపై షర్మిల కామెంట్స్ వైరల్

by Vemula.Srinu Prasad |

ఫ్రీ బస్సు అమలుపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు...

అది సిగ్గుచేటు:  ఫ్రీ బస్సు పథకంపై షర్మిల కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, సూపర్ సిక్స్ హామీల(Super Six Guarantees)ను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress state president YS Sharmila) విమర్శించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళల(Women)కు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ప్రభుత్వలు నేతలు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా? అని నిలదీశారు. 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా ? అని వ్యాఖ్యానించారు. అన్నదాత సుఖీభవ(Annadata SukhiBhava) కింద సొంతగా రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారని, 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారని ఆరోపించారు.

‘‘తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు. రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారు. మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదం. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసం. రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అటకెక్కింది. సుపరిపాలన కొండెక్కింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం. అమలు మాత్రం అరచేతిలో వైకుంఠం.’’ అని వైఎస్ షర్మిల విమర్శించారు.

Next Story