ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు: ప్రభుత్వానికి షర్మిల వార్నింగ్

by Vemula.Srinu Prasad |

డీజిల్ కోసం రైతులు, పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల కొద్ది క్యూలో పడిగాపులు కాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.

ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు: ప్రభుత్వానికి షర్మిల వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: డీజిల్(Diesel) కోసం రైతులు(Farmers), పెట్రోల్(Petrol) కోసం సాధారణ ప్రజలు(People) గంటల కొద్ది క్యూలో పడిగాపులు కాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress Party State Chief Ys Sharmila) విమర్శించారు. అత్యవసర స్థితిలో ప్రజా అవసరాలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల కోసం మాట్లాడటం, వారి ప్రయోజనాలే ముఖ్యంగా పని చేయడం, వారి కోసమే ప్రత్యేకంగా డీజిల్ సరఫరా కోరడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇదేనా ఈ ప్రభుత్వ ధోరణి? అని షర్మిల నిలదీశారు. రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? అని, ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులే ప్రాధాన్యమా? అని వ్యాఖ్యానించారు. ఇది పాలన కాదని, పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యమని మండిపడ్డారు. ముందుగా రైతులకు, సాధారణ ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా సాగేలా చూడాలన్నారు. ఆ తరువాతే కాంట్రాక్టర్లకు ప్రత్యేక సదుపాయాలపై మాట్లాడాలని సూచించారు. ప్రజలు ఎలా పోతే ఏంటని, తమకు కాంట్రాక్టర్లే ముఖ్యం అనుకుంటే, ప్రజల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని వైఎస్ షర్మిల హెచ్చరించారు.

వైఎస్ షర్మిల ట్వీట్

Next Story