బీజేపీ అండతోనే జగన్‌ బయట తిరుగుతున్నారు: చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై బయట తిరుగుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ ఆరోపించారు..

బీజేపీ అండతోనే జగన్‌ బయట తిరుగుతున్నారు: చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ(Bjp) అండతోనే జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) బెయిల్‌పై బయట తిరుగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్(Congress Leader Chintha Mohan) ఆరోపించారు. నెల్లూరులో మీడియాలో మాట్లాడిన ఆయన టీడీపీ(Tdp), వైసీపీ(Ycp)లు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఫెయిలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. తానేమీ చేయలేకపోతున్నానని, నిరాశ, నిస్సహాయతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో మనలాగే ఆర్థిక పరిస్థితి ఉండిందని, కానీ ఆ రాష్ట్రం లోటును అధికమించిందని తెలిపారు. కేరళలో విజయన్ ప్రభుత్వానికి కేంద్రం సాయం అందించడం లేదన్నారు. తమిళనాడుకి కేంద్ర సాయం అంతంత మాత్రమేనని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు తమ తెలివితేటలతో నెట్టుకొస్తున్నారన్నారు. ఏపీలో చంద్రబాబు అలా ఎందుకు చేయలేకపోతున్నారని చింతా మోహన్ ప్రశ్నించారు.

‘‘ప్రతి దానికీ జగన్ అంటూ నిందించడం కరెక్ట్ కాదు. జగన్ పొరపాట్లు చేశాడు కాదనడం లేదు, ఇక తిరిగి రాడు. ఒక్క ఛాన్స్ అడిగాడు ప్రజలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలలో మార్పు వస్తా ఉంది. రాష్ట్రానికి, దేశానికి ఒకే ఒక్క మార్గం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ హయాంలో శ్రీహరికోట, శ్రీ సిటీలో వందల కంపెనీలు, కృష్ణపట్నం పోర్టు, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం ఓడరేవు తెచ్చాం. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు నెల్లూరు జిల్లాకు ఏం చేశాయి.’’ అని ప్రశ్నించారు.

‘‘మాల, మాదిగల మధ్య తగాదా పెట్టి, విభజిస్తే నష్టం, కష్టం చంద్రబాబుకే. తెలుగుదేశం పార్టీ పుట్టుకతో ఎస్సీ వర్గీకరణకు బీజం పడింది. 1993లో కాన్షీరామ్ గారు ఏపీలో పర్యటించి ఎస్సీలను ఓబీసీలను కలపాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని 1700 మండలాల్లో తిరిగారు. గ్రామాల్లో కళ్ళు పోసి, సారా పోసి తగాదా పెడుతుంటారు.‌ మిశ్రా కమిషన్ వేసి చంద్రబాబునాయుడు మాల, మాదిగల మధ్య కొట్లాట పెట్టారు. వెంటనే మిశ్రా కమిషన్‌ను రద్దు చేయాలి. విశాఖ ఉక్కు పై ఉత్పత్తి మాటలు వద్దు. 11 వేల కోట్లు సాయం చాలదు. కేంద్ర మంత్రిమండలిచే ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టమైన ప్రకటన చేయించాలి. చంద్రబాబు మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. అయినా నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ పర్యటించారు. ఎల్లయ్యపాలెం అనే ఊరిలో నిద్రించి, ఉదయాన్నే హరిజనవాడ కెళ్ళి పాలు తాగాడు. అంటరానితనం నిర్మూలించేందుకు గాంధీ ఎంతగానో కృషి చేశారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ కృషి వల్ల ఎస్సీలకు 15% గిరిజనులకు 7:30 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. సోనియా గాంధీ, అర్జున్ సింగ్ కృషి వల్ల వెనుకబడిన వర్గాలకు 27% విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ చేసి కల్పించబడింది. రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎస్టీల మరింత దుర్భరంగా ఉంది. ఓబీసీల ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, శ్రీకాకుళానికి చెందిన ఓ మంత్రి చెప్పడం విడ్డూరం. విమానాల్లో తిరిగే ఆ మంత్రికి ఓబీసీల స్థితిగతులు తెలియవు.’’ అని కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ ఎద్దేవా చేశారు.

Next Story