Ys Sharmila: జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-29 15:50:18  IST  )

మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి అధికారం సూట్ కాలేదని కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ఇంచార్జి వైఎస్ షర్మిల అన్నారు...

Ys Sharmila: జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)కి అధికారం సూట్ కాలేదని కాంగ్రెస్(Congress) పార్టీ రాష్ట్ర ఇంచార్జి వైఎస్ షర్మిల(Ys Sharmila) అన్నారు. మరోసారి జగన్‌కు అధికారం రావాలంటే జగన్‌లో మార్పు రావాలని ఆమె సూచించారు. జగన్‌లో స్వార్థం తక్కువై, మంచి తనం పెరిగితే దేవుడు అధికారాన్ని ఇస్తాడేమోనని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ నైజం, నేచర్‌లో మార్పు రావాలని, అప్పటి వరకూ దేవుడు గాని, ప్రజలు గాని ఆశీర్వదించరని ఆమె స్పష్టం చేశారు. జగన్‌కు ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తారనేది ప్రజలు చూశారని చెప్పారు. తాము ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేస్తున్నామని, కానీ జగన్ లాంటిదికాదన్నారు. తాము గ్రామ స్వరాజ్యం కోసం యాత్ర చేస్తున్నామన్నారు. గ్రామాల్లో మళ్లీ ఉపాధి హామీ బ్రహ్మండంగా కొనసాగాలని చెప్పారు. ఉపాధి హామీ కోసం జగన్ ఎందుకు పాదయత్ర చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలే గమనించాలని వైఎస్ షర్మిల సూచించారు.

Read More.. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం.. పార్టీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు

Next Story