- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం.. పార్టీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) పునరుద్ధరించాలనే డిమాండ్ తో ఫిబ్రవరి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) పునరుద్ధరించాలనే డిమాండ్ తో ఫిబ్రవరి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఈ మేరకు ఆమె గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆనాడు మహానేత, దివంగత ముఖ్యమంత్రి YSR నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చేతుల మీదుగా పథకం ప్రారంభించిన బండ్లపల్లి గ్రామం నుంచే మన్రేగా పరిరక్షణ పోరాటం జరగనుందని పేర్కొన్నారు. APCC అధ్యక్షురాలిగా స్వయంగా నేనే ప్రతి జిల్లాలో ఉపాధి హామీ పనితో లబ్ధిపొందిన కుటుంబాలను కలిసి, బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన గ్రామ్ జి ( VB G - RAM G) చట్టంతో జరిగే నష్టాలను వివరించబోతున్నామని వెల్లడించారు. మోడీ తెచ్చిన కొత్త అక్రమ చట్టాన్ని రద్దు చేసే వరకు, మన్రేగాను తిరిగి కొనసాగిస్తామని చెప్పే వరకు ఉద్యమాన్ని రాష్ట్రంలో ఉధృతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలను వివరిస్తూ సాగే మన్రేగా పరిరక్షణ ఉద్యమానికి సంబంధించిన గోడ పత్రికను నేడు ఆంధ్రరత్న భవన్‌లో విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
నరేగా యాక్ట్ అద్భుతమైన పథకం
‘నరేగా యాక్ట్ అద్భుతమైన పథకం. ప్రపంచ దేశాలకు ఈ యాక్ట్ ఎంతో ఆదర్శం. ఉపాధి హామీ పథకం రూపకల్పనలో వైఎస్ఆర్ కృషి ఎంతో గొప్పది. ఉపాధి హామీకి శ్రీకారం చుట్టింది మన రాష్ట్రంలోనే. ఆనాడు సోనియా, మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. కూలీల కోరిక మేరకు ఏకంగా ఒకేసారి 60 లక్షల బ్యాంకు అకౌంట్లు తెరిచారు వైఎస్ఆర్. ఆనాడు ఉపాధి హామీ పథకం అంటే గ్రామాల్లో పెద్ద పండుగ. మన రాష్ట్రంలో నరేగా కింద ఈ ఏడాదిలో 91.44 లక్షల కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు. ఇంత గొప్ప పథకంపై బీజేపీ కక్ష గట్టింది. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తోంది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం అన్యాయం. గాంధీపై బీజేపీకి ద్వేషం ఉందని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం’ అని తెలిపారు.






