పరిహారం అంతా పచ్చి అబద్ధం: ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్

by Vemula.Srinu Prasad |

రైతన్నల రెక్కల కష్టం వర్షార్పణమైందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు..

పరిహారం అంతా పచ్చి అబద్ధం: ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రైతన్నల రెక్కల కష్టం వర్షార్పణమైందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్ంగా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రైతు సమస్యలపై ఆమె స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలకు 1.50లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగడం తీవ్ర ఆందోళనకరన్నారు. ఆరుగాలం పడ్డ శ్రమ కళ్లముందే నీళ్ల పాలైందని, పంట చేతికొచ్చే సమయంలో వానలు రైతన్న పొట్ట కొడుతుంటే, ఆపన్న హస్తం అందించాల్సిన కూటమి ప్రభుత్వం తమకేం పట్టనట్లు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. కూటమి పాలనలో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

‘‘పంట పండినా, మునిగినా, ఎండినా కష్టమే అన్నట్లుంది రాష్ట్ర రైతాంగం తీరు. చంద్రబాబుకి మాత్రం ఐటీపై ఉన్న రైతులపై లేదు. అన్నదాతకు భరోసా అంతా బూటకమే. పరిహారం అంతా పచ్చి అబద్ధమే. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు 22 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. 158 మండలాల్లో లక్షన్నర ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటనష్టం ఇంకా పెరుగుతోంది. అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 25 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 12 వేలు, ప్రకాశం జిల్లాలో 14 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 8 వేలు, కోనసీమ జిల్లాలో 7 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులే లెక్కలిచ్చారు. పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలతో పాటు ఇతర పంటలు పనికి రాకుండా పోయాయి. రైతుకి జరిగిన అపార నష్టంపై వెంటనే ఉన్నతస్థాయి సమావేశం జరపాలని, రైతన్నకు నష్టపరిహారం తక్షణ ప్రకటన చేయాలి.’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Next Story