- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మంత్రికి పితృ వియోగం.. డిప్యూటీ సీఎం సంతాపం
కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంట విషాదం.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే తండ్రి డాక్టర్ భీమన్న ఖండ్రే తుది శ్వాసను విడిచారు. దీంతో వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధాతప్త హృదయంతో స్పందించారు. కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు జరిగిన నష్టం బాధను వ్యక్తపరిచారు. డాక్టర్ భీమన్న ఖండ్రే స్వాతంత్య్ర సమరయోధులని డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ కర్ణాటక విముక్తి కోసం పోరాడిన యోధుడన్నారు. కర్ణాటక సమైక్యత ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాజకీయాల్లో కూడా మంత్రి స్థాయిలో ప్రజల కోసం పని చేశారన్నారు. వృద్ధాప్య సమస్యలు, వ్యాధుల కారణంగా ఆయన తుది శ్వాస విడిచిన విషయం తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు.






