- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Sharmila : బీజేపీని ఎదిరించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ : షర్మిల
దేశంలో బీజేపీని ఎదిరించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్(Congress) మాత్రమేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో బీజేపీని ఎదిరించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్(Congress) మాత్రమేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) వెల్లడించారు. నేడు కృష్ణా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన అజెండా అని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని, ఇతర పార్టీలు బీజేపీకి 'తొత్తులు, పొత్తులు'గా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీని ధైర్యంగా ఎదిరించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం తమ లక్ష్యమని, ఇందుకోసం జిల్లా స్థాయిలో పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపామె తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం కోసం సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.






