Breaking News: షర్మిల సభలో అలజడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-04-19 14:27:58  IST  )

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అల్లరిమూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

Breaking News: షర్మిల సభలో అలజడి
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అల్లరిమూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనీలో ఆమె సభ నిర్వహించారు. అయితే షర్మిలకు అనూహ్య ఘటన ఎదురైంది. ఆమె మాట్లాడుతుండగా సిద్ధం జెండాలు పట్టుకుని అల్లరిమూకల అలజడి సృష్టించారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సిద్ధమయితే మేము కూడా సిద్ధమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధమని, త్వరలోనే ఇంటికి పంపుతామంటూ షర్మిల సవాల్ విసిరారు.

Next Story