ఏపీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు.. ప్రకటించిన అధిష్ఠానం

by Naga Rani Yarlagadda |

ఏపీసీసీ అధ్యక్షురాలైన షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభ సీటు కేటాయించింది. కర్ణాటక నుంచి ఆమెకు అవకాశం కల్పించింది.

ఏపీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు.. ప్రకటించిన అధిష్ఠానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు. కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే.. ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. వాటిలో ఒకటి షర్మిలకు కేటాయించింది పార్టీ అధిష్ఠానం. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండటంతో.. షర్మిల గెలుపు ఈజీ కానుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు రాజ్యసభ అవకాశం కల్పించడం ద్వారా సౌతిండియా పాలిటిక్స్ లో కాంగ్రెస్ ను మరింత బలపడేలా చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఏపీలోనూ పునర్వైభవాన్ని పొందాలని చూస్తోంది. రెండ్రోజుల క్రితమే షర్మిల కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అవ్వగా.. రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

Next Story