- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారికి అభినందనలు.. టీచర్స్ డే వేళ CM చంద్రబాబు ట్వీట్
Congratulations to those who are lighting the lamps of knowledge.. CM Chandrababu tweets on Teachers' Day

దిశ, వెబ్‌డెస్క్: ఉపధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సంబురాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో స్వపరిపాలన దినోత్సవాలు నిర్వహిస్తూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీచర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని కామెంట్ చేశారు.
తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ జరుపుకునే పండుగ రోజు ఇది అని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారని పేర్కొన్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. అదే అంకితభావంతో పనిచేస్తూ భావితరాలకు ఉపాధ్యాయులు మార్గదర్శులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.






