- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబద్ధతతో పని చేస్తున్న వైద్యులకు అభినందనలు : మంత్రి సత్యకుమార్
ప్రాథమిక ఆరోగ్య సేవల్లో (Primary Health Services) నిబద్ధతతో పని చేస్తున్న వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister SatyaKumar Yadav) అభినందించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రాథమిక ఆరోగ్య సేవల్లో (Primary Health Services) నిబద్ధతతో పని చేస్తున్న వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister SatyaKumar Yadav) అభినందించారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వైద్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సేవల్లో నిబద్ధతతో పనిచేస్తున్న వైద్యులకు అభినందనలను తెలియజేశారు. ప్రజలు వైద్యులను నమ్మకం, విశ్వాసం, సేవాభావానికి ప్రతీకగా భావిస్తారన్నారు. ఆ విశ్వాసానికి తగిన విధంగా అత్యున్నత బాధ్యతతో, కరుణాభావంతో ప్రతి రోగిని చూడడం మనందరి కర్తవ్యం అని పేర్కొన్నారు. వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. వైద్యుల పక్షాన ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీనిచ్చారు.
అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు రాష్ట్రంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందిస్తూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారనన్నారు. వైద్యులను సమాజం నమ్మకం, విశ్వాసం, సేవాభావానికి ప్రతీకగా భావిస్తుందని తెలిపారు. ఆ గౌరవానికి అనుగుణంగానే ప్రతి డాక్టర్ తన వృత్తిని అత్యున్నత బాధ్యతతో నిర్వర్తించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం, వైద్యులు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ పీహెచ్‌సీల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ తరహా సమావేశాలు వైద్యులలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని, ఆరోగ్య వ్యవస్థ పటిష్టతకు దోహదపడతాయని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు.






