ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు అభినందనలు : హోం మంత్రి

by Thanuru Gopichand |

జగన్ సర్కారులో అన్యాయం. కూటమి ప్రభుత్వంలో బాధిత కుటుంబానికి న్యాయం.

ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు అభినందనలు : హోం మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏపీ కేబినెట్ (AP Cabinet) తీర్మానించిన విషయం విదితమే. గురువారం చేసిన ఈ తీర్మానంపై రాష్ట్ర హోం మంత్రి అనిత వంగలపూడి (Anitha Vangalapudi) స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)లకు నిర్ణయం విషయమై అభినందనలను తెలియజేశారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు గానూ ధన్యవాదాలను తెలియజేశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు నాటి వైసీపీ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ ను వేధింపులకు గురి చేసిందన్నారు. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేసి మనోవేదనను కలిగించిందన్నారు. సుధాకర్, ఆయన కుటుంబం పడిన మానసిక వేదనను తాను ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు. వైయస్ జగన్ దురహంకారానికి బలైన సుధాకర్ ను తిరిగి తీసుకురాలేమని బాధను వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించిందన్నారు. అందుకోసం సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేశారన్నారు.

Next Story