- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan:‘కంగ్రాట్యులేషన్స్ డియర్’.. మాజీ సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాజాగా భావోద్వేగ ట్వీట్ చేశారు. అసలు విషయంలోకి వెళితే.. ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డి(Varsha Reddy)కి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘వర్షమ్మకు అభినందనలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతో పాటు, డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.
ప్రతిష్టాత్మకం.. కింగ్స్ కాలేజ్ లండన్!
ఇంగ్లాండ్లోని 'కింగ్స్ కాలేజ్ లండన్' ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాలలో ఒకటి. ఈ విఖ్యాత విశ్వవిద్యాలయాన్ని 1829 లో నాటి ఇంగ్లాండ్ రాజు కింగ్ జార్జ్ 4.. రాయల్ చార్టర్ ద్వారా స్థాపించారు. అంతర్జాతీయ స్థాయి బోధనలో, అత్యాధునిక పరిశోధనల్లో ఈ యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉంది. ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు 14 మందికి ప్రతి ష్టాత్మక నోబెల్ బహుమతి లభించడం విశేషం. ప్రస్తుతం 147 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, 195 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అందిస్తున్న 'కింగ్స్ కాలేజ్ లండన్'లో, 185 దేశాలకు చెందిన 23 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.






