- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేదాంత లిమిటెడ్ కు షరతులతో కూడిన అనుమతులు
ఏపీలో ఆన్ షోర్ చమురు గ్యాస్ డ్రిల్లింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన ఎన్ఓసీ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఆన్ షోర్ చమురు గ్యాస్ డ్రిల్లింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన ఎన్ఓసీ ఇచ్చింది. ఈ అనుమతులతో కృష్ణా జిల్లాలో 20 చోట్ల డ్రిల్లింగ్ పనులు జరగనున్నాయి. డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలసీ 2018 కింద వేదాంత లిమిటెడ్ కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులనిచ్చింది. సంస్థ 35 చోట్ల డ్రిల్లింగ్ కు ఎన్ఓసీ కోరగా.. కేవలం 20 చోట్ల మాత్రమే ఎన్ఓసీని ప్రభుత్వం మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో చమురు, సహజ వాయువు అన్వేషణ కోసం వేదాంత లిమిటెడ్ (కైర్న్ ఆయిల్ అండ్ గ్యాస్) సంస్థకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. కృష్ణా జిల్లాలోని మోవ్వ, గూడూరు మండలాల్లో ఉన్న 'కాజా బ్లాక్'లో 20 బావుల తవ్వకానికి జలవనరుల శాఖ 'నో అబ్జెక్టన్ సర్టిఫికేట్' (NOC) జారీ చేసింది. డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ (DSF) పాలసీ కింద ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
కఠినమైన నిబంధనలు
అయితే అందుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. బందరు కాలువ, కేడీఎస్ నెట్‌వర్క్, స్థానిక చెరువుల నుంచి ఉపరితల నీటిని వాడుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కాలువలు, డ్రైన్లకు 500 మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలు, తవ్వకాలు జరపకూడదని వేదాంతకు సూచించింది. డ్రిల్లింగ్ వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు, కాలువ నీరు కలుషితమైతే, తక్షణమే అనుమతులు రద్దు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. జలవనరుల శాఖ అధికారులు ఎప్పుడైనా ముందస్తు సమాచారం లేకుండా సైట్‌ను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారని సంస్థకు సూచించింది. అదే విధంగా వేదాంత సంస్థ మొత్తం 35 ప్రాంతాల్లో తవ్వకాలకు అనుమతి కోరగా, సాగునీటి వ్యవస్థలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున 15 ప్రాంతాలను ప్రభుత్వం తిరస్కరించింది. కేవలం 20 ప్రాంతాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పనులు ప్రారంభించే ముందు వేదాంత సంస్థ ఏపీ వాల్టా చట్టం (APWALTA) ప్రకారం భూగర్భ జలాల వినియోగానికి సంబంధించి మరిన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ (Fracking) ప్రక్రియ వల్ల పర్యావరణానికి, తాగునీటికి ముప్పు పొంచి ఉందని స్థానిక రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను ప్రభుత్వం విధించింది.






