- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాంగనీస్ తవ్వకాలపై ఫిర్యాదులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
విజయనగరంలో దేవాడ మైనింగ్ బ్లాక్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి....

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం(Vizianagaram)లో దేవాడ మైనింగ్ బ్లాక్(Devada Mining Block)పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు(Manganese Mining) జరుపుతున్నట్లు ఆరోపణలు చెలరేగాయి. ఆ మైనింగ్ బ్లాక్ ఏర్పాటు సందర్భంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరాలు వచ్చాయని, అయితే వాటిని పరిగణించలేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)కు ఫిర్యాదులు అందాయి. దీంతో మైనింగ్ బ్లాక్‌పై ఆయన ఫోకస్ పెట్టారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను కోరారు. విజయనగరం జిల్లా అధికారులతో చర్చలు జరిపి పూర్తి వివరాలతో రిపోర్టుల సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
Next Story






