మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యూట్యూబర్ రావణ్ అరెస్ట్ పై కొడాలి నాని రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్ టీడీపీ మద్దతు దారుడు, బాబు, లోకేష్, బాలయ్యకు అనుకూలంగా పనిచేస్తున్నాడని అన్నారు.

అందుకే టీడీపీ నేతలు ఆయన గురించి మాట్లాడటంలేదన్నారు. రావణ్ పై టీడీపీ నేతలు ఎక్కడా కేసు పెట్టలేదని చెప్పారు. పవన్‌ను ప్రశ్నించాడనే రావణ్‌ను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ప్రజల నోరు నొక్కే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ కొడాలి నానిపై కేసులు నమోదయ్యాయి. కానీ ఆయనకు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఇప్పుడు మరోసారి పోలీసుకు ఫిర్యాదు చేయడంతో శిక్ష పడుతుందా లేదా అనేది తేలియాల్సి ఉంది.

Next Story