కావేరి బస్సు ప్రమాద మృతులకు పరిహారం.. రూ. 40 లక్షలు అందజేత

by Vemula.Srinu Prasad |

కావేరి బస్సు ప్రమాద మృతులకు పరిహారం అందజేశారు..

కావేరి బస్సు ప్రమాద మృతులకు పరిహారం.. రూ. 40 లక్షలు అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: కావేరి బస్సు ప్రమాదం(Kaveri Bus Accident)లో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరి కుటుంబాలకు తాజాగా బస్సు యాజమాన్యం(Bus Owner) పరిహారం(Compensation) అందజేసింది. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున ప్రకటించారు. ఈ మేరకు మంత్రి భరత్‌(Minister Bharat)కు రూ.40 లక్షల చెక్కును యాజమాన్యం అందజేసింది.

కాగా కర్నూలు జిల్లా(Kurnool District) చిన్నటేకూరు(ChinnaTekuru)లో కావేరి ట్రావెల్స్ బస్సు(Kaveri Travels Bus)లో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై బైక్ ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో 19 మంది సజీవదహనం కాగా పలువురికి గాయాలయ్యాయి. బస్సుకు ఇన్స్యూరెన్స్ ఉందని అందరికీ పరిహారం అందజేస్తామని కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు పరిహారం చెక్కును అందజేసింది.

Next Story