డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల నుంచి కమిటీ ఏర్పాటు : సి.కల్యాణ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-30 12:01:12  IST  )

విశాఖపట్నంలోని దొండపర్తిలో సినీ నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు (AP Film Chamber Meeting) సమావేశమయ్యారు.

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల నుంచి కమిటీ ఏర్పాటు : సి.కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని దొండపర్తిలో సినీ నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు (AP Film Chamber Meeting) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నిర్మాతలు స్రవంతి రవికిశోర్, సి. కల్యాణ్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు హాజరవ్వగా.. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై చర్చించారు. భేటీ అనంతరం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల నుంచి కమిటీ ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కోసంఘం నుంచి 9 మంది చొప్పున 27 మందితో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మాత సి.కల్యాణ్ (Producer C Kalyan) తెలిపారు. కమిటీ సభ్యుల పేర్లు త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామన్న ఆయన.. ఆ వివరాలన్నింటినీ సోమవారం (జూన్ 2) మీడియాకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అలాగే సమావేశంలో ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటోన్న సమస్యలు, థియేటర్ నిర్వహణ, పర్సంటేజీలపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. ఇకపై ప్రతినెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story