- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్‌పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్టేషన్ కార్యాలయాలు.. మంత్రి అనగాని ఆసక్తికర వ్యాఖ్యలు
జీరో ఎర్రర్ రెవన్యూ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జీరో ఎర్రర్ రెవన్యూ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మీడియాతో మాట్లాడుతూ.. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఏడాది రూ.10,169 కోట్ల ఆదాయం ఆర్జించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పాస్‌పోర్టు కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో ఏ మార్పు జరిగినా, అది ఆన్‌లైన్‌లో శాశ్వతంగా ఉండేట్లు వ్యవస్థ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక, గత పాలకులు చేసిన తప్పుల వల్లే రెవెన్యూ సమస్యలు కొనసాగుతున్నాయని మంత్రి అనగాని విమర్శించారు. గత పాలకులు చేసిన అస్తవ్యస్త విధానాలు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయని తెలిపారు. మొత్తం 7,600 గ్రామాల్లో పకడ్బందీగా రీ సర్వే పూర్తి చేశామన్నారు. జేసీలు లేని జిల్లాలకు వెంటనే జేసీలను నియమించాలని సీఎం ఆదేశించారన్నారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పనిచేయాలని సీఎం పేర్కొన్నారని తెలిపారు. భూ సమస్యలన్నింటికీ ఇక జేసీలదే బాధ్యత చెప్పారని అని అనగాని వెల్లడించారు. అలాగే పెండింగ్ సమస్యల పరిష్కారంపై గురువారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్నట్లు తెలిపారు.






