- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొక్కిసలాట ఘటన.. ఆలయంతో దేవాదాయశాఖకు సంబంధం లేదు
by Naga Rani Yarlagadda |
ఆలయంతో దేవాదాయశాఖకు సంబంధం లేదని, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందినదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన భక్తుల తొక్కిసలాటలో 9 మంది మరణించగా.. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ఆలయంతో దేవాదాయశాఖకు సంబంధం లేదని, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందినదని తెలిపారు. వారి సొంత డబ్బుతోనే ఒక వ్యక్తి ఆలయాన్ని నిర్మించారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతామన్న కలెక్టర్.. ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా.. తొక్కిసలాటలో సుమారు 25 మంది గాయపడగా.. వారిని పలాసలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
Next Story






