- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ శ్రీధర్ కీలక ఆదేశాలు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు....

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta) జడ్పీటీసీ ఉప ఎన్నికలు(Zptc Elections) ఈ నెల 12న జరగనున్నాయి. దీంతో ఈ రెండi ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ 12న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పోలింగ్ పూర్తి అయ్యే వరకూ ఎన్నికల అధికారులు, పోలీసులు సమన్వయంతో సేవలు అందించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల వద్దకు ఓటు హక్కు ఉన్న వాళ్లు మాత్రమే వెళ్లాలని, ఇతరులు వెళ్లకూడదని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
Next Story






