పొద్దున్నే రెచ్చిపోయిన చలి పులి.. తీవ్రత ఎంతో తెలుసా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-30 02:59:14  IST  )

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి గజ గజ వణికిస్తోంది...

పొద్దున్నే రెచ్చిపోయిన చలి పులి.. తీవ్రత ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) చలి(Cold) పులి గజ గజ వణికిస్తోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు కాస్త తగ్గింది. అయినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింతగానే ఉంది. ఉష్ణోగ్రతలు(Temperatures) పడిపోవడంతో తెల్లవారు జాము నుంచే చలి వణికిస్తోంది. ఉదయం పూట ఏపీ(Ap)లో ఒకలా.. తెలంగాణ(Telangana)లో మరోలా వాతావరణం ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారంగా కంటే తక్కువ డిగ్రీలు నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఏపీలోని పలు చోట్ల చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ(Paderu Agency)లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినుములూరులో 12, పాడేరు అరకులో 14 డిగ్రీలు, చింతపల్లిలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రలోనూ చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి దిగిపోతున్నాయి. మెదక్‌లో 14.3 డిగ్రీలు, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 14.5, పటాన్ చెరులో 15.4, హైదరాబాద్‌లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించారు. ఇది సాధారణంగా తక్కువ అని తెలిపారు.

కాగా గత మూడు రోజులుగా ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమురంభీం, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగిందని అంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు కూడా వీస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం కూడా వాతావరణం చల్లగా ఉందని అంటున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తుందని, తద్వారా రోడ్లపై వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుందంటున్నారు. అటు పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటుందని, ఉదయం 10 గంటల వరకూ చల్లదనం తగ్గడంలేదని చెబుతున్నారు. దీంతో చలి బారీ నుంచి తమను కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులు వినియోగిస్తున్నామంటున్నారు.

మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటకులు చలిని ఎంజాయ్ చేస్తున్నారు. వాతారణంలో మార్పులు కారణంగా చలి తీవ్రతలో హెచ్చు తగ్గులున్నాయని అధికారులు చెబుతున్నారు. చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వస్తే జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Next Story