దసరా తర్వాత వస్తా.. స్వయంగా పరిశీలిస్తా: కొబ్బరి రైతులకు పవన్ భరోసా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-20 16:30:40  IST  )

సముద్రపు నీరు చేరి కోనసీమలో కొబ్బరి తోటలకు భారీ నష్టం జరిగింది..

దసరా తర్వాత వస్తా.. స్వయంగా పరిశీలిస్తా: కొబ్బరి రైతులకు పవన్ భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: సముద్రపు నీరు చేరి కోనసీమలో కొబ్బరి తోటలకు భారీ నష్టం జరిగింది. వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. కొబ్బరి రైతులు లబోదిబోమంటున్నారు. వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రెయిల్‌లోకి ఉప్పు నీరు చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి రావడంతో కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయని, మొత్తం 13 గ్రామాల్లో భారీగా నష్టం జరుగుతోందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఈ సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ దృష్టికి చేరింది. దీంతోఆయన స్పందించారు. కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు. స్వయంగా తానే వచ్చి ఆ ప్రాంతాలను సందర్శిస్తానని తెలిపారు. దసరా తర్వాత రైతులతో కలిసి కొబ్బరి తోటలను పరిశీలిస్తానని చెప్పారు. అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తానన్నారు. అనంతరం పరిష్కార మార్గాలను ఆలోచిస్తామని డిప్యూటీ సీఎం పవక్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Next Story