- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : కూలీల పట్ల అమానవీయంగా వ్యవహరించారు కోడి పందెం నిర్వాహకులు డబ్బులు చోరీ చేశారనే అనుమానంతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అనుమానం ఉన్న కూలీలందరినీ అర్థనగ్నంగా చేయడమే కాకుండా వారి పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారు. వారిని తాళ్లతో కట్టేసి ఒకే చోట కూర్చోబెట్టి అమానవీయంగా వ్యవహరించారు. వారిని చిత్రహింసలు పెడుతూ చోరీ చేసిన లెక్కలు చెప్పాలంటూ భయభ్రాంతులకు గురి చేశారు. వారి పట్ల కర్కశంగా వ్యవహరించి మానవత్వానికే మచ్చ తెచ్చారు. ఈ ఘోరమైన ఘటన కృష్ణా జిల్లాలోని కంకిపాడు (Kankipadu) మండలంలోని ఉప్పులూరు గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం ఉప్పులూరులో సంక్రాంతి (Sankranti) సందర్భంగా కోడి పందెంను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే పేకాట, గుండాటను కూడా నిర్వహించారు. పేకాట వద్ద పని చేయడానికి తోట్లవల్లూరుకు చెందిన కొందరిని నిర్వాహకులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పేకాటకు సంబంధించిన లెక్కల్లో తేడాలు వచ్చాయి. కూలీలపైనే అనుమానం రావడంతో నిర్వాహకులు వారందరికీ ఒక చోటుకు చేర్చి చేతులు కట్టేశారు. వారిపై విచక్షణరహితంగా దాడి చేస్తూ వీడియోను కూడా తీశారు. విషయం జిల్లా ఎస్పీ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్ గా స్పందించారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టి ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపును చేపట్టారు. కూలీలకు నిర్వాహకుల నుంచి విముక్తి కల్పించారు.






