- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగ్గంపేటలో జోరుగా కోడి పందాలు
సంక్రాంతి (Sankrati) సమీపిస్తుండడంతో కోడి పందాలు (Kodi Pandelu) కూడా రాష్ట్రంలో ఊపందుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి (Sankrati) సమీపిస్తుండడంతో కోడి పందాలు (Kodi Pandelu) కూడా రాష్ట్రంలో ఊపందుకున్నాయి. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందాల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఓ వైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా పందెం రాయుళ్లు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. బరుల కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు. ఏయే ప్రాంతాల్లో బరులు గీయాలనే అంచనాలను కూడా ముమ్మరం చేశారు. ఎవరెవరికి ఎంత ముట్టజెప్పాలో కూడా డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో జగ్గంపేటతో పాటు కాకినాడ జిల్లాలోని గండేపల్లి, తుని రూరల్, పిఠాపురం, తొండంగి, గోకవరం, గొల్లప్రోలు, కరప, కాకినాడ రూరల్ వంటి ప్రాంతాల్లో కోడి పందాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. జగ్గంటపేలో ఇప్పటికే పందాల జోరు కొనసాగుతోంది. పందాల మాటున గుండాట, నంబర్ లాటరీలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసుల కళ్లు గప్పి పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోడి పందాల సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని పోలీసు యంత్రాంగం ప్రజలను కోరుతోంది.
పందేలకు ప్లాన్ సిద్ధం?
రోజుకు ఒక్కో బరిలో కనీసం 30 లక్షల రూపాయల విలువైన కోడి పందాలను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బరిలో ఐదు పెద్ద పందేలు, కనీసం మూడు కొసరు పందేలా వేసేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలియవస్తోంది. గ్రామాల వారీగా బరులను వేయాలనే ప్రణాళిక అమలులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా లక్షలాది రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా సరదా కోసం పోటీలనే కారణాన్ని పైకి చూపించి.. లోపల మాత్రం జోరుగా బెట్టింగులు సాగించేలనే వ్యూహం కనిపిస్తోంది. అయితే సంక్రాంతి అంటే కోడి పందెలు కామన్ అని ఏపీ ప్రజానీకం అభిప్రాయపడుతోంది.






