Ap Elections: ఏ క్షణమైనా టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-09 13:25:22  IST  )

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని కూటమి నాయకులు అంటున్నారు..

Ap Elections: ఏ క్షణమైనా టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA quota MLC elections)కు నగరా మోగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కూటమి నాయకులు కసరత్తులు చేశారు. జనసేన(Jansena)కు ఒక సీటు కేటాయించారు. దీంతో పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోదరుడు నాగబాబు(Nagababu) నామినేషన్ దాఖలు చేశారు. అయితే మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ(Tdp) పోటీ చేస్తోంది. దీంతో ఆశావహుల లిస్టు భారీగా ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీడీపీ అధినేత చంద్రబాబు(Tdp Chief Chandrababu) ప్రారంభించేశారు. సోమవారం నామినేషన్(Nommination) గడువు ముగియనుండటంతో ఏ క్షణమైనా అభ్యర్థుల లిస్టు విడుదల అయ్యే అవకాశం ఉందని కూటమి నాయకులు అంటున్నారు. దీంతో ఆశావహులు అమరావతిలో చివరి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి తమకు సీటు కేటాయించాలని కోరుతున్నారు.

అయితే పొత్తులో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో సీటు కోల్పోయిన నాయకులకు సీఎం చంద్రబాబు నాయుడు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కానీ 25 మంది నేతలు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. వీరిలో 10 మంది మాత్రం కచ్చితంగా తమకు పదవులు కావాలని అంటున్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేశ్‌కు క్లోజ్‌గా ఉన్న నాయకులతో సిఫార్సు చేయిస్తున్నారట. మరోవైపు పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీ నాయకులు కూడా మళ్లీ పదవులు ఆశిస్తున్నారట. దీంతో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.

Next Story