- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో జనగణన నగారా.. ఇంటింటి సర్వే షురూ...!
ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్ద కాలం తర్వాత జరగబోయే అతిపెద్ద జనగణన ప్రక్రియకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారికంగా జీవో జారీ చేయడంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో దశాబ్ద కాలం తర్వాత జరగబోయే అతిపెద్ద జనగణన(Census) ప్రక్రియకు కూటమి ప్రభుత్వం(Coalition Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారికంగా జీవో జారీ చేయడంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. 2027లో ప్రధాన జనగణన జరగనుండగా దానికి నాందిగా 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మొదటి దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రాథమిక దశలో భాగంగా అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి, గృహాల వివరాలతో పాటు అందుబాటులో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల డేటాను క్షుణ్ణంగా సేకరిస్తారు.
వచ్చే ఏడాది జరిగే ఈ కసరత్తు ముగిసిన అనంతరం, అసలైన జనాభా లెక్కల నమోదు ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి వివరాలను నమోదు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఇక చివరగా మార్చి 1 నుండి 5 వరకు రివిజనల్ ఎన్యుమరేషన్ చేపట్టి సేకరించిన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే సరిచేస్తారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈ గణాంకాలు అత్యంత కీలకం కానున్నాయి.






