శాయ్‌లో లైంగిక వేధింపులు.. కోచ్‌పై ఫోక్సో కేసు

by Vemula.Srinu Prasad |

ఏలూరు శాయ్‌లో కోచ్ లైంగిక వేధింపులు కలకలం రేపింది. ..

శాయ్‌లో లైంగిక వేధింపులు.. కోచ్‌పై ఫోక్సో కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు శాయ్‌(Eluru Sai)లో కోచ్ లైంగిక వేధింపులు కలకలం రేపింది. వెయిల్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న బాలికల(Girls) పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి. అయితే కోచ్‌కు భయపడి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇటీవల కాలంలో బెంగళూరు నుంచి వచ్చిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఓ బాలిక ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు రహస్యంగా విచారణ జరిపారు. ఈ విచారణలో కోచ్ అకృత్యాలు నిజమేనని తేలింది. దీంతో ఏలూరు టూ టౌన్ పోలీసులుకు బెంగళూరు బృందం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అథ్లెటిక్ కోచ్ వినాయక ప్రసాద్‌పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story