సీఎం దార్శనికత వల్ల విజయవంతంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర : హోం మంత్రి

by Thanuru Gopichand |

ప్రతి నెలా మూడో శనివారం పర్యావరణహిత కార్యక్రమాలు.

సీఎం దార్శనికత వల్ల విజయవంతంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర : హోం మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) దార్శనికత వల్ల స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర (Swarnandhra-Swachhandhra) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. అనకాపల్లి జిల్లాలోని కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో (Tegada Model School) స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. కలెక్టర్ విజయకృష్ణణ్ తో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడంతో పాటు వారికి మిఠాయి డబ్బాలు, బియ్యం సంచులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని కాలుష్యరహిత, పరిశుభ్రమైన, సంపన్న రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ఒక ఉద్యమంలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. ప్రతి నెల మూడో శనివారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణ, చెత్త నుంచి సంపద సృష్టించడం వంటి అంశాలపై అవగాహన పెంచడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అధికారులు విద్యార్థులకు చెత్త నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి సరఫరా వంటి అంశాలపై అవగాహన కల్పించారని హోంమంత్రి తెలియజేశారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు.

Next Story