రేపు రాజమండ్రికి సీఎం వైఎస్ జగన్

by Seetharam |   (  Updated:2023-08-29 09:15:57  IST  )

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది.

రేపు రాజమండ్రికి సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 30న రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగా తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి మధ్యాహ్నం 3:50 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. అనంతరం రాజమహేంద్రవరం స్థానిక నేతలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.ఆ తర్వాత సాయంత్రం 4.10 గంటలకు మంజీరా కన్వెన్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 4.25 గంటలకు తాడేపల్లికి బయల్దేరుతారు.ఈ మేరకు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story