- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 21న అల్లూరి జిల్లాకు సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 21న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించబోతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 21న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయినట్లు సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 21న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులతో మాట్లాడిన అనంతరం ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.






