వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తారు : మంత్రి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-23 08:26:37  IST  )

నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కృషి.

వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తారు : మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : వెలిగొండ ప్రాజెక్ట్ (Veligonda Project) పనులను సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) వారం రోజుల్లో స్వయంగా పర్యవేక్షిస్తారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్.. ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడతారన్నారు. రానున్న వారం రోజుల్లో అందుకు సంబంధించిన భూమి పూజ చేస్తారన్నారు. ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. అనుమతులు రాగానే టన్నెల్-2లో టీబీఎం మెషిన్ తొలగింపు పనులు మొదలుపెడతామని వెల్లడించారు. తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడం, భూగర్భ జలాలను పెంపొందించడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు. అందులో భాగంగా ప్రాజెక్టులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని అన్నారు.

Next Story