రాయలసీమలో వ్యవసాయంపై సీఎం సమీక్ష

by Thanuru Gopichand |

రాయలసీమలో వ్యవసాయ (Agriculture In Rayalaseema) రంగ పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్షించారు.

రాయలసీమలో వ్యవసాయంపై సీఎం సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : రాయలసీమలో వ్యవసాయ (Agriculture In Rayalaseema) రంగ పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్షించారు. ఏపీ సెక్రటేరియట్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకంలో భాగంగా ఉద్యాన పంటల అభివృద్ధిపై అధికారులతో సీఎం చర్చించారు. అదే విధంగా రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తో చేయూతనిచ్చే అంశాలను పరిశీలించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడంపై పలు సూచనలను చేశారు. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించనున్న నేపథ్యంలో సమగ్ర సమాచారాన్ని సేకరించి విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు. సాగునీరు, రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించం ద్వారా హార్టికల్చర్ రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు.

Next Story