తిరుమలలో CM రేవంత్ రెడ్డి కుటుంబం

by Gantepaka Srikanth |

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి తిరుమలకు వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సబ్యులు మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుమలలో CM రేవంత్ రెడ్డి కుటుంబం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి తిరుమలకు వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సబ్యులు మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా, రేణిగుంట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అధికారులు స్వాగతం పలికారు. సీఎం సతీమణి, కూతురు, అల్లుడు, మనుమడిని ఆప్యాయంగా పలుకరించారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Next Story