- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి బాధ్యత పోలీసులదే: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం నాయుడు అన్నారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతా భావం కల్పించే బాధ్యత పోలీసులదేనని సీఎం అన్నారు. టెక్నాలజీని వాడుకుని నేర నియంత్రణ చేయాలన్నారు. డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించగలగాలని, వారెన్ని డ్రామాలు ఆడినా టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు.
నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కలియుగ వైకుంఠమైన శ్రీవేంకటేశ్వరస్వామి నెలకున్న ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా చిన్న అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సీఎం పేర్కొన్నారు.






