- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan Mohan Reddy : సలహాదారులకు సీఎం జగన్ తీపికబురు
వైసీపీ ప్రభుత్వంలోని సలహాదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు చెప్పారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంలోని సలహాదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు చెప్పారు. సలహాదారుల పదవీకాలాన్ని మరోసారి పొడిగించారు. సజ్జల రామకృష్ణారెడ్డి,జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్‌ల పదవీకాలాన్ని మరోసారి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వీరు మరో ఏడాది పాటూ సలహాదారులుగా పనిచేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురిని సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది. శాఖలవారీగా సలహాదారుల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే కోర్టులో విచారణ సైతం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ నలుగుర్ని మరో ఏడాది పాటూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story






