కొత్త గవర్నర్‌‌తో సీఎం జగన్‌ దంపతులు భేటీ

by Vinod kumar |

నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు రాజ్‌భవన్‌లో గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

కొత్త గవర్నర్‌‌తో సీఎం జగన్‌ దంపతులు భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు రాజ్‌భవన్‌లో గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు అభినందనలు తెలిపారు. ఇకపోతే శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌గా అబ్ధుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

ఇదిలా ఉంటే నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు అధికార యంత్రాంగం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

Next Story