నేడు విజయవాడకు సీఎం జగన్.. కారణం ఇదే..!

by Indraja |   (  Updated:2024-03-12 03:46:29  IST  )

నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు.

నేడు విజయవాడకు సీఎం జగన్.. కారణం ఇదే..!
X

దిశ వెబ్ డెస్క్: నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నారు. ఆ తరువాత మొదటగా కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోని అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ పార్కును ఆయన ప్రారంభించనున్నారు.

అనంతరం విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు సీఎం జగన్ శాశ్వత హక్కులు కల్పించి లబ్ధి దారులకుఅందజేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత సీఎం జగన్ తిరిగి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.



Next Story