చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్టే: సీఎం జగన్

by Disha Web Desk 16 |
చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్టే: సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపి ఇంటికి తెచ్చుకున్నట్లేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ఇస్తున్న వాగ్ధానాలపై సీఎం జగన్ విమర్శలు చేశారు. ‘చంద్రబాబు ఇచ్చే హామీలు నెరవేర్చలేనివి. చంద్రబాబు ఇచ్చిన 7 హామీలకు ఏటా రూ.87,312 కోట్లు కావాలి. అంత డబ్బు ఎక్కడ నుంచి తెస్తారో చెప్పడం లేదు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. చంద్రబాబు వాగ్ధానాలు నమ్మితే నట్టేట మునిగినట్టే. టీడీపీ అధికారంలోకి వస్తే మా పథకాలు అన్ని ఆపేస్తారు. మళ్లీ జన్మభూమి కమిటీలతో కమీషన్లు కొట్టేస్తారు. ప్రజలపై వివక్ష పూరితంగా వ్యవహరిస్తారు. ఫ్యానో ఇంట్లోనే ఉండాలి... సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాసును సింక్‌లో వేయాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 మంది ఎమ్మెల్యేలు , 25 ఎంపీలను అందించాలి. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తాం. చేయగలిగినవే చేస్తాం. చేయలేనివి చెప్పం. అధికారం కోసం ఎప్పుడూ తాము పని చేయలేదు. అధికారం పోతుందనే భయం మాకు లేదు. చంద్రబాబు గెలిస్తే ప్రస్తుత పథకాలన్నీ రద్దు చేస్తారు. జగన్ పై ఆరు పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. చంద్రబాబు ఎన్ని పార్టీలతే పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం సున్నా. ’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Read More..

‘ప్యాకేజీ స్టార్‌ది సిట్ అండ్ స్టాండ్ విధానం’.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఫైర్



Next Story