- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్ కీలక ఆదేశాలు.. రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా అందిస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా అందిస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం.. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలి.. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Next Story






