Breaking: కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-06-04 07:50:40  IST  )

సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు...

CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆయన అందజేయనున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన జగన్.. ఈ ఎన్నికల్లో బోర్లా పడ్డారు. దాదాపు రాష్ట్రలోని అన్ని జిల్లాలో మెజార్టీ స్థానాల్లో ఓటమి చవిచూడబోతున్నారు. వైసీపీ మంత్రులతో సహా కీలక నేతలు సైతం ఓటమి దిశగా కొనసాగుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 133 స్థానాల్లో భారీ మెజార్టీల దిశగా కొనసాగుతోంది. అటు జనసేన 21 స్థానాలు, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో ముందజలో ఉంది. ఇప్పటికే టీడీపీ విజయం ఖాయంకావడంతో అధికారికంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖమంత్రిగా ప్రమాణస్వీకరం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 9న అమరావతి వేదికగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Next Story