రూ.2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా: అమరావతిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-08 12:10:39  IST  )

అమరావతిపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు...

రూ.2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా: అమరావతిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital) అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని విస్తరణలో భాగంగా ప్రభుత్వం మరికొన్ని ఎకరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Cm Jagan Mohan Reddy) మరోసారి అమరావతి(Amaravati)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ DPR ప్రకారం అమరావతికి లక్ష కోట్లు కావాలని, మరో 50 వేల ఎకరాలకు ఇంకో రూ.లక్ష కోట్లు కావాలని జగన్ తెలిపారు. అంతేకాదు రూ.2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా అని ప్రశ్నించారు. తొలి దశ పూలింగ్‌లో రైతులకే న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు రెండో దశ ఎందుకు అని ప్రశ్నించారు. ఇక మౌలిక వసతుల కోసం ఎకరానికి రూ.2 కోట్లు అవసరమని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అసలు ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. తన బినామీల ద్వారా దోచుకోవడానికి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) రాజధాని పేరుతో భూములు సేకరిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

‘‘నదీతీరంలో రాజధానిని నిర్మిస్తున్నారు. సుప్రీంకోర్టు నదీతీర నిర్మాణాలను పరిగణనలోకి తీసుకోవాలి. నదీతీరంలో భవనం కడతామంటే ఎవరికీ అనుమతి ఉండదు. కానీ చంద్రబాబు ఏకంగా నదీతీరంలో రాజధానిని కడుతున్నారు. రాజధానికి ప్రత్యేకంగా ఉండదు.. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అది రాజధాని..’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

Read More... మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు: జగన్‌‌కు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

రాజధానిపై మరోసారి విషం కక్కిన జగన్: మంత్రులు ఒక్కసారిగా బ్లో అవుట్

Next Story