Kadapa: పులివెందుల నేతలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-12-24 11:16:40  IST  )

సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యారు...

Kadapa: పులివెందుల నేతలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యారు. అటు పార్టీ కేడర్‌ను సైతం రెడీ చేస్తున్నారు. ఈ మేరకు మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇంచార్జిలను మార్చారు. ఇప్పుడు ప్రాంతాల వారీగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలతో భేటీ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. గెలుపు ఆవశ్యకతపై నేతలకు వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ వచ్చే ఎన్నికల్లో తామే గెలవాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.

తాజాగా కడప జిల్లా ఇడుపులపాయ, పులివెందులలో సీఎం జగన్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అటు కిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. అనంతరం పులివెందుల వైసీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Next Story