గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం జగన్ భేటీ

by Disha Web Desk 14 |
గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం జగన్ భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌ను సీఎం జ‌గ‌న్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సోమవారం విజ‌య‌వాడ‌లోని రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లిన జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌తో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. మంగళవారం విశాఖలో జీ-20 సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ సదస్సులో దేశ విదేశీ అతిథులు పాల్గొననున్నారు.ఇప్పటికే చాలామంది విశాఖ చేరుకున్నట్లు సమాచారం.

విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఘనంగా విందు ఏర్పాటు చేస్తోంది. అలాగే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్సెండ్ చేసింది. దీనిపై జగన్ గవర్నర్ కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story